
Movie: TIGER
NAGESWARA RAO
Singer: SINDURI
VISHAL
Lyrics: BHASKARABHATLA
Music: GV
PRAKASH KUMAR
Lyrics
ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేకుంటాలే నాతో నిన్ను తెచ్చేకుంటాలే
కొప్పుల్లో మల్లెచెండులా నిన్ను ముడిచేసుకుంటాలే
బువ్వలో ఉల్లిపాయలా నిన్ను కొరికేసుకుంటాలే
నా పంచప్రాణాలు
నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చి రాగానే
నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే
ఇన్నాళ్లు ఈ సిగ్గు
ఏ సంతకెల్లిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు
గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరొ చెప్పుంటారే
చెప్పింది నాతో ఈ తాళిబొట్టు
తనలోన నిన్నే దాచేసినట్టు
పట్టింది అంటే హ ఈ చెమట బొట్టు
నీ చూపు నన్నే చంపేసినట్టు
ఏ ఎక్కువ చప్పుడు చెయ్యొద్దు
అంటూ పట్టీలా కాళ్లట్టుకోవాలె
అల్లరి కొంచెం తగ్గించమంటూ
గాజుల్ని బతిమాలుకోవాలె
కావిళ్ళ కొద్ది కౌగిల్లు తెచ్చి
మనమధ్య పొయ్యాలె
ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేకుంటాలే నాతో నిన్ను తెచ్చేకుంటాలే
నా ఒంటిమీద నీ గోటిముద్ర
చెరిపేసేనంట నా కంటినిద్ర
నా గుండెపైనా నీ వెలిముద్ర
దాచేది ఎట్ట ఓ రామసేంద్ర
ఏ రేయిని తెచ్చి రాయికి కట్టి మనతోటే ఉంచేసుకోవాలె
తెల్లారిందంటూ కూసేటి కోడిని కోసేసి కూరండుకోవాలె
నా బొట్టుబిళ్లకి రెక్కలు వచ్చి నీ మీద వాలాలే
ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేకుంటాలే నాతో నిన్ను తెచ్చేకుంటాలే
పిచ్చిగా నచ్చినట్లుగా నిన్ను పిలిచేస్తాలే
చక్కగా మొక్కజొన్నలా నిన్ను ఒలిచేసుకుంటాలే
నా పంచప్రాణాలు
నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చి రాగానే
నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే
ఇన్నాళ్లు ఈ సిగ్గు
ఏ సంతకెల్లిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు
గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరొ చెప్పుంటారే
No comments:
Post a Comment